జూలై 7 నుంచి ‘కాఫీ విత్​ కరణ్’.. టీజర్ విడుదల

జూలై 7  నుంచి ‘కాఫీ విత్​ కరణ్’..  టీజర్ విడుదల

సినీ రంగ ప్రముఖులతో నిర్వహించే ప్రఖ్యాత టాక్​ షో ‘ కాఫీ విత్​ కరణ్​’  7వ సీజన్​ జూలై 7 నుంచి డిస్నీ హాట్​ స్టార్​ లో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన టీజర్​ ను కరణ్​ జోహర్​ ఆదివారం తన ఇన్​ స్టాగ్రామ్​ అకౌంట్​ లో షేర్​ చేశారు.   ఈ టీజర్​ లో షారుఖ్​ ఖాన్​, ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్​, రణ్​వీర్​ సింగ్​, రణ్ బీర్​ కపూర్​, బిపాషా బసు, సైఫ్​ అలీ ఖాన్​, అనుష్క శర్మ, అర్జున్​ కపూర్​, ఐశ్వర్యా రాయ్​, సల్మాన్​ ఖాన్​తదితరులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.  దీన్ని షేర్​ చేసిన వెంటనే సినీ ప్రముఖులు, నెటిజెన్ల కామెంట్లు వెల్లువెత్తాయి. కాఫీ విత్​కరణ్​ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నామని పలువురు కామెంట్స్​ పెట్టారు.  
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

తన టాక్​ షో పై కరణ్​ జోహర్​ ఇటీవల ఇన్​ స్టాగ్రామ్​ వేదికగా ఒక పోస్ట్​ పెట్టారు.  ‘‘టాక్​ షో మొదలెట్టి 18 ఏళ్లు గడిచాయి. నా కాఫీని ఇన్నేళ్లు మరిగించానంటే నమ్మశక్యం కావడం లేదు”అని కామెంట్​ చేశారు. కాగా, ఈసారి కాఫీ విత్​ కరణ్​ టాక్​ షోలో సమంత కూడా పాల్గొంటారనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.