
- ఫుల్ స్వింగ్‌లో ప్రిపరేషన్స్
ముంబై: ఇంగ్లండ్ టూర్‌కు ముందు హార్డ్ క్వారంటైన్‌లో ఉన్న టీమిండియా క్రికెటర్లు జిమ్‌లో చెమటోడుస్తున్నారు. న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టారు. ముంబైలోని ఓ హోటల్ ఉన్న ఆటగాళ్లు.. జిమ్‌లో చాలా కష్టపడుతున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, చతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా వర్కౌట్స్ చేస్తున్న వీడియోను బీసీసీఐ తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ‘ప్రిపరేషన్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌నకు ముందు టీమిండియా జిమ్‌లో చెమటోడుస్తోంది’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఐపీఎల్ ఆగిపోయిన తర్వాత వచ్చిన కొంత విరామం మంచి చేసిందని టీమ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ అన్నాడు. ఈ బ్రేక్‌లో ప్లేయర్లకు అవసరమైన రెస్ట్ లభించిందని చెప్పాడు. ‘లాస్ట్ ఐపీఎల్ నుంచి ప్లేయర్లు చాలా బిజీగా ఉన్నారు. అందుకే ఈ బ్రేక్ టైమ్‌లో ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలని, రిలాక్స్ అవ్వాలని సూచించాం. ఆపై నెమ్మదిగా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత వాళ్లకు ఏం అవసరమో ఆ దిశగా నెమ్మదిగా పని ప్రారంభించాం. క్వారంటైన్లో హోటల్ రూమ్స్‌లో వెయిట్స్ అందుబాటులో ఉంచాం. ఏడో రోజు నుంచి ప్రతి ఒక్కరూ జిమ్‌లో ఇండివిడ్యువల్ ట్రెయినింగ్ స్టార్ట్ చేశారు. అన్నింటినీ కవర్ చేసి వాళ్లను సరైన దిశలోకి తీసుకొచ్చాం. యూకే టూర్‌కు మేం రెడీగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఇండియా మెన్, విమెన్ టీమ్స్ ఈ నెల 3న యూకేలో అడుగుపెడతాయి.