టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన కోహ్లీ

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన కోహ్లీ

టీ20 వరల్డ్ కప్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన టీ20లో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వెయ్యి పరుగులు చేసిన రెండో బ్యాట్స్మన్గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు..ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత బ్యాట్స్మన్గా రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ చరిత్రలో 22 ఇన్నింగ్స్లు ఆడి..80కి పైగా సగటుతో 1001 పరుగులు చేశాడు. ఇందులో 12 అర్థసెంచరీలున్నాయి. 

https://twitter.com/T20WorldCup/status/1586685552505589761

అగ్రస్థానంలో జయవర్ధనే..
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఉన్నాడు. అతను 31 మ్యాచుల్లో 1016 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 12 పరుగులే చేశాడు. మరో 16 పరుగులు చేసి ఉంటే..జయవర్ధనే రికార్డును కోహ్లీ అధిగమించేవాడు. అటు టీ20 వరల్డ్ కప్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగానూ కోహ్లీ రికార్డులకెక్కాడు. అతను ఇప్పటి వరకు 12 అర్థసెంచరీలు కొట్టాడు. కోహ్లీ తర్వాత క్రిస్ గేల్, రోహిత్ శర్మ 9 హాఫ్ సెంచరీలతో తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు.