నేను వీగన్​ కాదు.. వెజిటేరియన్‌‌

నేను వీగన్​ కాదు.. వెజిటేరియన్‌‌

ముంబై: ఫుడ్‌‌ విషయంలో తాను వీగన్‌‌ అని ఎప్పుడూ చెప్పలేదని, తాను కంప్లీట్‌‌ వెజిటేరియన్‌‌ అని టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ స్పష్టం చేశాడు. మాంసంతో పాటు జంతువుల నుంచి సేకరించిన పాలు, ఎగ్స్‌‌ వంటి వాటిని ఆహారంగా తీసుకొనని వారిని వీగన్‌‌ అంటారు. అయితే ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఇటీవల నిర్వహించిన చాట్‌‌ సెషన్‌‌లో  మీ డైట్‌‌ ఏంటంటూ ఓ ఫ్యాన్‌‌ అడిగిన ప్రశ్నకు రిప్లయ్‌‌ ఇచ్చిన కోహ్లీ.. కూరగాయాలు, గుడ్లు తింటానని చెప్పాడు. గతంలో ఇంగ్లండ్‌‌ మాజీ ప్లేయర్‌‌ కెవిన్‌‌ పీటర్సన్‌‌తో జరిగిన ఓ చాట్‌‌ షోలో తాను వీగన్‌‌గా మారానని కోహ్లీ చెప్పాడు. ఇప్పుడు మళ్లీ అతని డైట్‌‌ చార్ట్‌‌లో ఎగ్స్‌‌ ఉండటంతో... ఫ్యాన్స్‌‌ అతన్ని ట్రోల్‌‌ చేశారు. ఈ ట్రోల్స్‌‌కు స్పందించిన విరాట్‌‌.. తాను వీగన్‌‌ అని ఎప్పుడూ చెప్పలేదని, వెజిటేరియన్‌‌ అని క్లారిటీ ఇచ్చాడు. ఇక ట్రోలింగ్‌‌ ఆపి మీకు కావాల్సిన కూరగాయాలు తినండంటూ ట్వీట్‌‌ చేశాడు.