శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. సాధారణంగా ఏడాదిలో నాలుగుసార్లు తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏప్రిల్ 2న ఉగాది సందర్భంగా ఇప్పుడు తిరుమంజనం నిర్వహించారు. ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకుని బంగారువాకిలి వరకు.. శ్రీవారి ఆలయం లోపలి ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రిని నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్ ను వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తయిన తర్వాత సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతా సంప్రోక్షణ చేశారు. తిరుమంజనం పూర్తయ్యాక భక్తులను సర్వదర్శనానికి అనుమతించామని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తల కోసం:

జెలెన్స్కీని వదలను.. పుతిన్ వార్నింగ్

గేదెను తప్పించబోయి ఆర్టీసీ బస్సు తుక్కుతుక్కు

13 ఏండ్లకే సొంత బ్రాండ్..లక్షల్లో సంపాదన