జెలెన్స్కీని వదలను.. పుతిన్ వార్నింగ్

జెలెన్స్కీని వదలను.. పుతిన్ వార్నింగ్

మాస్కో: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధాన్ని ఆపాలని, శాంతియుత పరిస్థితులను నెలకొల్పాలని జెలెన్ స్కీ పంపిన విజ్ఞప్తికి పుతిన్ ఘాటుగా స్పందించారు. యుద్ధాన్ని ముగించడానికి తన షరతులను తెలుపుతూ జెలెన్ స్కీ స్వయంగా ఓ నోట్ రాసి పుతిన్ కు పంపారు. రష్యాకు చెందిన ఓ శాంతిదూత ద్వారా ఈ లేఖను పుతిన్ దగ్గరకు చేర్చారు. ఈ సందర్భంగా పుతిన్ స్పందిస్తూ.. జెలెన్ స్కీని వదలబోనని, ఉక్రెయిన్ ను అణచివేస్తానని ఘాటుగా బదులిచ్చారని తెలుస్తోంది. 

కాగా, ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభమై నెల రోజులు దాటింది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ లోని అనేక సిటీలు ధ్వంసమయ్యాయి. ఒకవైపు రెండు దేశాలు శాంతి చర్చలకు ప్రయత్నిస్తూనే.. హోరాహోరీగా పోరు సాగిస్తున్నాయి. మరోవైపు యుద్ధానికి ముగింపు పలికేందుకు రెండు దేశాల ప్రతినిధులు మరో దఫా సంప్రదింపులకు సిద్ధమయ్యారు. రెండు వారాల తర్వాత చర్చల ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కుతోంది. అయితే ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో పెద్దగా ప్రగతి సాధించలేదని రష్యా వర్గాలు తెలిపాయి. మరోవైపు ఉక్రెయిన్ ను మొత్తంగా కంట్రోల్​లోకి తీసుకోవడంలో విఫలం కావడంతో.. తమ అధీనంలోకి వచ్చిన ప్రాంతాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని రష్యన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తల కోసం:

గేదెను తప్పించబోయి ఆర్టీసీ బస్సు తుక్కుతుక్కు

13 ఏండ్లకే సొంత బ్రాండ్..లక్షల్లో సంపాదన