కాంగ్రెస్​ను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

కాంగ్రెస్​ను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో, మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రజలకు ఆ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

బీఆర్ఎస్​పై విసిగిన ప్రజలు మార్పు కోరుకున్నారని, బీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్​ను ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. అధికార పగ్గాలు చేపట్టగానే ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తప్పకుండా అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు తనపై చూపిన ఆదరణ మరిచిపోలేనన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు ఉన్నారు.