KKRvsRCB: వరుణ్ చక్రవర్తీ విజృంభణ..ఆర్సీబీ పరాజయం

KKRvsRCB: వరుణ్ చక్రవర్తీ విజృంభణ..ఆర్సీబీ పరాజయం

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచులో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఆర్సీబీపై 81  పరుగుల భారీ తేడాతో విక్టరీ కొట్టింది. 205 పరుగు టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగుళూరు..కోల్ కతా బౌలర్ల ధాటికి 17.5 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. 


205 పరుగుల లక్ష్యంతో బరిలోకి  దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ మంచి శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 44 పరుగులు జోడించారు. అయితే 21 పరుగులు చేసిన కోహ్లీ..నరైన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ వెంటనే కెప్టెన్ డూ ప్లెసిస్ (23) కూడా పెవీలియన్ చేరాడు. ఇక అప్పటి నుంచి బెంగుళూరు వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. మాక్స్ వెల్(5), హర్షల్ పటేల్(0), షాబాద్ అహ్మద్ (1), దినేష్ కార్తీ్క్ (9) అందరూ దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఆర్సీబీ 86 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. వరుణ్ చక్రవర్తీ 4 వికెట్లు పడగొట్టాడు. సుయాన్ష్ శర్మ 3 వికెట్లు, సునీల్ నరైన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. 

ఆదుకున్న డేవిడ్ విల్లే..ఆకాశ్ దీప్..

ఈ సమయంలో డేవిడ్ విల్లే (20)..ఆకాశ్ దీప్(17) ఆదుకున్నారు. లక్ష్యం కొండంత ఉన్నా..బెదరలేదు. కోల్ కతా బౌలర్లను ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే వీరిద్దరు మెరుపులు మెరిపించినా..ఫలితం లేకుండా పోయింది. చివరకు బెంగుళూరు 17.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయింది. కోల్ కతా బౌలర్లలో  


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు ఏకంగా 204 పరుగులు సాధించింది. బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు 26 ఓవర్లకే తొలి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ డేవిడ్ విల్లే బౌలింగ్ లో  ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మన్ దీప్ సింగ్ ను కూడా విల్లే పెవీలియన్ చేర్చాడు. కొద్దిసేపటికే కెప్టెన్ నితీష్ రాణా కూడా ఔటవడంతో కోల్ కతా 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఆదుకున్న గుర్భాజ్..

ఈ సమయంలో కోల్ కతాను గుర్భాజ్, రింకు సింగ్ జట్టును ఆదుకున్నారు. నాల్గో వికెట్ కు 42 పరుగులు జోడించారు. ఇదే సమయంలో గుర్బాజ్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో హాఫ్ సెంచరీ సాధించాడు.  హాఫ్ సెంచరీ అనంతరం గుర్భాజ్ కర్ణ్ శర్మ బౌలింగ్ లో ఔటయ్యాడు. గుర్భాజ్ తర్వాత క్రీజులోకి వచ్చిన రస్సెల్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ 89 పరుగులకే 5 వికెట్లు నష్టపోయింది. 

దుమ్మురేపిన శార్దూల్..

ఈ సమయంలో శార్దూల్ ఠాకూర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెంగుళూరు బౌలర్లను చితక్కొట్టాడు. కేవలం 29 బంతుల్లో 68 పరుగులతో ఈడెన్ గార్డెన్స్ తో సునామీ సృష్టించాడు. ఇతనికి రింకు సింగ్  46 పరుగులు చేసి సహకరించడంతో కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. బెంగుళూరు బౌలర్లలో  డేవిడ్ విల్లే, కర్ణ్ శర్మ చెరో  రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, హర్షల్ పటేల్, బ్రేస్ వెల్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.