GT vs KKR : చివరి ఓవర్లో వరుస సిక్సర్లు.. కోల్కత్తా థ్రిల్లింగ్ విక్టరీ

GT vs KKR : చివరి ఓవర్లో వరుస సిక్సర్లు.. కోల్కత్తా థ్రిల్లింగ్ విక్టరీ

కోల్ కత్తా నైట్ రైడర్స్.. గుజరాత్ టైటాన్స్ ను సొంత గడ్డపై ఓడించింది. అహ్మదాబాద్ వేదికపై జరిగిన ఈ మ్యాచ్ లో ప్రతీ ఓవర్ ఉత్కంటగా సాగింది. చివరికి కోల్ కత్తాను విజయం వరించింది. చివరి ఓవర్ లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన రింకు సింగ్.. కోల్ కత్తాకు థ్రిలింగ్ విక్టరీని అందించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్.. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కత్తా.. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (15, 12 బంతుల్లో), జగదీషన్ (6, 8 బంతుల్లో) శుభారంభాన్ని అందించలేకపోయారు. 

మూడో వికెట్లో వచ్చిన వెంకటేష్ అయ్యర్ (83, 40 బంతుల్లో), కెప్టెన్ నితిష్ రాణాతో (45, 21 బంతుల్లో) కలిసి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. చేజారిపోయిన కోల్ కత్తా ఇన్నింగ్స్ ను ఈ ఇద్దరు కలిసి నిలబెట్టారు. అంతలోనే క్రీజ్ లో సెట్ అయిన బ్యాట్స్ మెన్ ను అల్జారీ జోసెఫ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో 155/ 4 గెలుపు బాటలో నిలిచింది కోల్ కత్తా.

రషిద్ మాయ: 

తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ లో రస్సెల్, నరైన్, శార్ధూల్ ఠాకూర్ ఉన్నారు. ఇక కోల్ కత్తా గెలుపు కాయమే అనుకున్నారంతా. అంతలోనే గుజరాత్ కెప్టెన్ రషీద్ ఖాన్ వచ్చి అంతా తలకిందులు చేశాడు. హాట్రిక్ బంతుల్లో రస్సెల్, నరైన్, శార్ధూల్ ఠాకూర్ ఔట్ చేసి.. కోల్ కత్తా ఆశలపై నీళ్లు చల్లాడు.

రింకు దెబ్బ..

అప్పటివరకు నెమ్మదిగా ఆడుతున్న రింకు సింగ్ గేర్ మార్చాడు. గుజరాత్ బౌలర్లపై విరుచుకు పడి పరుగులు రాబట్టాడు. రింకు సింగ్ కు ఉమేష్ యాదవ్ సహకారం అందించాడు. చివరి ఓవర్లో 29 పరుగులు కావాల్సిన టైంలో స్ట్రైక్ లో ఉన్న ఉమేష్ యాదవ్.. సింగిల్ తీసి రింకు సింగ్ కు స్ట్రైక్ ఇస్తాడు.

యశ్ దయాల్ వేసిన ఆ ఓవర్లో చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి కోల్ కత్తాకు విజయాన్ని అందించాడు.  గుజరాత్ బౌలర్లలో షమీ, జాశువా లిటిల్ చెరో వికెట్ తీసుకున్నారు. రషీద్ ఖాన్ కు మూడు, అల్జారీ జోసెఫ్ కు 2 వికెట్లు దక్కాయి.