Kolkata rape-murder case: నిందితులను ఉరితీయాలి: కోల్కతాలో సీఎం మమత భారీ ర్యాలీ

Kolkata rape-murder case: నిందితులను ఉరితీయాలి: కోల్కతాలో సీఎం మమత భారీ ర్యాలీ

కోల్కతాలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం (ఆగస్టు 16) భారీ ర్యాలీ నిర్వహించారు.లేడీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, నింది తులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ కోల్ కతా లో మహిళలతో కలిసి ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ లో పాల్గొన్నారు. 

మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై ఆగస్టు 9న ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ రూమ్‌లో అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై దేశం మొత్తం అట్టుడుకుతోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోని డాక్టర్లు నిరసనలు చేపట్టారు. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రకాల వైద్య సేవలు నిలిపివేయాలని ఐఎంఏ ప్రకటించింది.  

నిపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించారు. కేంద్ర ఏజెన్సీ బృందం ఆగస్టు 14న కోల్‌కతా పోలీసుల నుంచి కేసును స్వీకరించింది.