
రెడిన్ కింగ్స్లీ(Redin Kingsley)..సహజమైన నటుడు. అరుదైన కామెడీని,తన నోటి యాసతోనే పండించడంలో రెడిన్ స్టైలే వేరు. ఎంతో అమాయకంగా కనిపిస్తూనే..అట్ట్రాక్ట్ చేసే రెడీన్ పంచులకు నవ్వని ఆడియాన్స్ ఉండరు సుమా! అందుకే ఆయన వాయిస్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
46 ఏళ్ళ రెడిన్ ఆదివారం (డిసెంబర్ 10న) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. చెన్నైకు చెందిన టెలివిజన్ ఆర్టిస్ట్ సంగీతను ఆయన పెళ్లి చేసుకున్నారు.ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీకి చెందిన అతికొద్దిమంది ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం రెడిన్ మ్యారేజ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ నూతన దంపతులకు విషెష్ చెబుతున్నారు.
#RedinKingsley and #Sangeetha were in a relationship for more than an year or so ❤
— Kollywood Pictures (@KollywoodPics) December 10, 2023
They got married at chamundeshwari temple at Mysore pic.twitter.com/G3MRK3q5en
రెడిన్ కింగ్స్లీ సినిమాల విషయానికి వస్తే..
ఆయన 2018లో నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కొలమావు కోకిల’ సినీమాతో నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశాడు. బిగ్గరగా మాట్లాడే శైలితో ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. ఇక ఆ తర్వాత తెలుగులో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన వరుణ్ డాక్టర్ లోని రెడిన్ యాక్టింగ్ కు త్తమ కమెడియన్‌గా ‘సైమా’ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా..దళపతి విజయ్ బీస్ట్, విజయ్ సేతుపతి కాతువాకుల రెండు కాదల్, రజినీకాంత్ పెద్దన్న, జైలర్ సినిమాలతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లోను మంచి గుర్తింపు దక్కించుకున్నారు.