కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అరెస్ట్

కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అరెస్ట్

ప్రముఖ కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్(Ravinder chandrashekharan) ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) అరెస్ట్‌ చేశారు. చెన్నైకి చెందిక ప్రముఖ వ్యాపారవేత్తను మోసం చేసినందుకు గాను ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్‌ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఓ ప్రాజెక్ట్ లో  ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చని చెన్నైకి చెందిన బాలాజీ అనే ఒక వ్యాపారవేత్తను నమ్మించాడట రవీందర్ చంద్రశేఖరన్. దీని కోసం అవసరమయ్యే నకిలీ పత్రాలను కూడా సిద్ధం చేయించాడట. అందుకు బాలాజీ నుండి రూ. 15.83 కోట్లు తీసుకున్నాడట. ఈ ప్రాజెక్టు గురించి ఈ ఇద్దరి మధ్య సెప్టెంబర్ 17, 2020న ఒప్పందం జరిగినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి.

ALSO READ : ఈ అమ్మాయిని చంపినోడు.. పోలీస్ స్టేషన్లో ఉరేసుకున్నాడు

 

అది మోసపూరితమైన ప్రాజెక్టు అని తెలియడంతో.. తన డబ్బు తిరిగి ఇవ్వాలని బాలాజీ ప్రశ్నంచాడట. దానికి రవీందర్‌ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. రవీందర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావించారు బాలాజీ. రవీందర్ చంద్రశేఖరన్ పై చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే రవీందర్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు పోలీసులు.