38 భాషల్లో విడుద‌ల కానున్న‌ సూర్య సినిమా!

38 భాషల్లో విడుద‌ల కానున్న‌ సూర్య సినిమా!

కమర్షియల్ సినిమాల్లోనూ ప్రయోగాలు చేస్తూ తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సూర్య 42(Suriya42) వ చిత్రం కంగువ(Kanguva). సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇందులో సూర్య  ఆటవిక యోధుడిగా వైల్డ్ లుక్లో కనిపిస్తూ సూర్య ఇంటెన్స్ పెంచుతున్నాడు. కంగువా అంటే 'అగ్ని శక్తి ఉన్న వ్యక్తి' అని అర్థం. 

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఒక సాలిడ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.కంగువ సినిమాను వరల్డ్ వైడ్ గా 38 భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఇన్ని భాషల్లో రిలీజవుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. అంతేకాకుండా అన్ని భాషల్లో 3డీ వెర్షన్ కూడా రిలీజ్ కాబోతుందని సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

కంగువా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిషా పఠాని హీరోయిన్గా నటిస్తోంది. 3Dలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు..రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శివ (Shiva) తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను యూవీ క్రియేషన్స్ (UV Creations), స్టూడియో గ్రీన్(Studio green) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ మూవీ వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24 న రిలీజ్ కాబోతుంది.