
పార్టీ మార్పుపై బీజేపీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. పార్టీ మారడం లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో మునుగోడులో గెలుస్తామని.... కాషాయ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలోనే కొనసాగుతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. అక్టోబర్ 5వ తేదీన మునుగోడులో ముఖ్యకార్యకర్తలతో సమావేశం అయిన రాజగోపాల్ రెడ్డి..ఆ తర్వాత పార్టీ మార్పుపై తన నిర్ణయాన్ని ప్రకటించారు. తాను పార్టీ మారడం లేదంటూ ప్రకటన విడుదల చేశారు.
బీజేపీ సైనికుడినూ ముందుకు సాగుతా..
నేను బీజేపీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నానంటూ కొన్ని పత్రికలు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తు్న్నాను. నేను వ్యక్తిగత స్వార్థం కోసం సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదు. నా చుట్టూ ఉన్న సమజానికి నా వంతు మంచి చేయాలన్న లక్ష్యంతో రాజకీయ మార్గాన్న ఎంచుకున్న వ్యక్తిని. ఆ దిశనగానే ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఎక్కడా అవినీతి, వ్యక్తిగత స్వార్ధం లేకుండా నీతి నిజాయితీగా పనిచేస్తూ వచ్చాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం నా ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వరాష్ట్ర సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాను. కానీ పద్నాలుగు వందల మంది యువకుల బలిదానాలు, వేలాది యువజన, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు ..సబ్బండ వర్గాల ఒక్కటై తెచ్చుకున్న తలెంగాణలో రాజకీయ పరిణామాలు నన్ను ఎంతో కలిచివేశాయి. ప్రజా తెలంగాణ బదులు ఒక్క కుటుంబం కోసమే తెలంగాణ అన్నట్లు పరిస్తితి తయారైంది. కేసీఆర్ ప్రజా పాలకుని వలే కాకుండా తెలంగాణకు నిజాం రాజువలే నియంతృత్వ పోకడలు పోతున్నారు.
కేసీఆర్ అవినీతిని కక్కించి
తెలంగాణ ఆకలినైపనా భరిస్తుంది కానీ..అవమానాలను భరించదు. ఆత్మగౌరవం కోసం ఎందాకైనా జెండా ఎత్తిపడుతుందన్న విషయం ఇప్పటికే అనేక విషయాల్లో వెల్లడైంది. అందుకే తెలంగాణలో ప్రజా రాజ్యం ఏర్పాటు దిశగానే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలుకు అనుగుణంగా ముందుకు నడిపించే శక్తి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు ఉందని విశ్వసించి దేశ సౌభాగ్యంలో నేను భాగస్వామి కావాలని అడుగు వేశాను. మునుగోడులో కేసీఆర్, అయన ఎమ్మెల్యేలు ఇక్కడే మకాం పెట్టినా.. నా మీద, బీజేపీ మీద మునుగోడు ప్రజలు అచంచల విశ్వాసాన్నే చూపారు. కేసీఆర్ అవినీతిని కక్కించి, కుటుంబ తెలంగాణ బదులు ప్రజాస్వామిక, బహుజన తెలంగాణ ఏర్పాటు చేసే సత్తా ఒక్క బీజేపీకే ఉంది. నేనే కాదు ముఖ్య నాయకులెవరూ బీజేపీని వీడరు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించే దిశగా భారతీయ జనతా పార్టీ సైనికులై ముందుకు కదులుతున్నాము...’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సుదీర్ఘ ప్రకటనలో వివరించారు.