ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్..రాజయ్యకు రైతు బంధు చైర్మన్.. ఉత్తర్వులు జారీ

ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్..రాజయ్యకు రైతు బంధు చైర్మన్.. ఉత్తర్వులు జారీ

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ టికెట్లు దక్కని నేతలను అధిష్టానం బుజ్జగిస్తోంది. ఇందులో భాగంగా వారికి పదవులు కట్టబెడుతూ చల్లబరుస్తోంది. జనగామ టికెట్ దక్కని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని సీఎం కేసీఆర్  టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా  నియమించారు. అలాగే స్టేషన్ ఘన్ పూర్ టికెట్ దక్కని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను  తెలంగాణ రైతు బంధు చైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం అక్టోబర్ 5వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.

అక్టోబర్ 3వ తేదీ వరకు మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న నందికంటి శ్రీధర్..అక్టోబర్ 4వ తేదీన బీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఆయనకు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఎంబీసీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చింది. నందికంటి శ్రీధర్ ను ఎంబీసీ చైర్మన్ గా నియమించారు సీఎం కేసీఆఱ్. అటు మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్ నియమితులయ్యారు. వీరి నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.