తెలంగాణ వచ్చినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ వచ్చినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ వచ్చిన తర్వాత.. మన తలరాతలు మారుతాయని అనుకున్నాం.. కానీ ఏ ఒక్కరి తలరాత మారలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ బడులు, దవాఖానాలో మౌలిక సదుపాయాలు లేవని చెప్పారు. 

తన రాజీనామా దెబ్బకు 110 కొత్త ఆసరా పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ అమల్లోకి వస్తే తెలంగాణను బాగా అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు పేద ప్రజల కోసమే ప్రవేశపపెట్టబోతుందని చెప్పారు. 

పేదలు, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు సాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తిని గెలిపించాలని కోరారు. నల్గొండ జిల్లా గట్టుప్పల మండలం వెల్మకన్నె గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.