
మంత్రి పదవి ముఖ్యం కాదు.. ఇచ్చిన హామీలు అమలు చేయాలి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తనకు మంత్రి పదవి రాకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటున్న వాస్తవాన్ని డిప్యూటీ సీఎం భట్టి మీడియాకు చెప్పారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయనకు ‘ఎక్స్’లో థ్యాంక్స్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని.. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని తెలిపారు. అవినీతి రహిత పాలనను రాష్ట్ర ప్రజలకు అందించాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.