
బీజేపీ సంస్థాగత మార్పల్లో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కీలక పదవి దక్కింది. ఆయనకు జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. ఆయనను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
ప్రస్తుతం తెలంగాణ నుంచి విజయశాంతి, వివేక్ వెంకటస్వామి లాంటి ముఖ్య నేతలు జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. కాగా ఇప్పటికే ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మైన్ గా నియమించింది.