నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీస్ ఎత్తేసి స్కూల్ పెట్టిస్తానన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండలోని నిరుద్యోగ నిరసన ర్యాలీలో రేవంత్ తో కలిసి హగ్ చేసుకున్న కోమటిరెడ్డి.. రేవంత్ తాత అయినంకే నల్గొండ వచ్చిండన్నారు.
ఒకప్పుడు స్కూటర్ లేని జగదీష్ రెడ్డి 80 ఎకరాల ఫాంహౌస్ ఎలా కొన్నారని ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నాగారంలో ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నాడన్నారు. బీఫామ్ ఇచ్చేది పీసీసీ ప్రెసిడెంట్ అయినా నల్గొండలో పోటీ చేసేది తానేనని చెప్పారు. బీఫామ్ తన ఇంటికే వస్తుందన్నారు.
దళితబంధులో 3 లక్షలు తీసుకుంటున్న ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందన్న కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎవరేం మాట్లాడినా పట్టించుకోవద్దని కేసీఆర్ నిరంజన్ రెడ్డికి సిగ్గు లేకుండా చెబుతున్నారని విమర్శించారు. మంత్రి నిరంజన్ రెడ్డికి 400 ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
కేసీఆర్ మాటలతో మాయ చేసే మాయల మరాఠీ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజలకు ఎన్నో హామీలిచ్చి మోసం చేశారని విమర్శించారు. రెండు సార్లు మోసపోయామని..ఇక మూడోసారి మోసపోవద్దని సూచించారు.