నాకు అనారోగ్యమంటూ తప్పుడు కథనాలు: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నాకు అనారోగ్యమంటూ తప్పుడు కథనాలు: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని, ఎలాంటి అస్వస్థతకూ గురికాలేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తన ఆరోగ్యంపై తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను హైదరాబాద్​లోని తన ఇంట్లోనే ఉన్నానని, బ్రీతింగ్​ ప్రాబ్లమ్ ​లేదని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తప్పుడు కథనాలను ప్రసారం చేస్తే చట్టపర మైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ‘‘కొద్ది రోజుల కింద నల్గొండ జిల్లా అమ్మ నబోలుకు చెందిన ఉపేందర్ అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు. అతడి కుటుంబాన్ని కలిశాను. అతడి భార్య, పిల్లలు నా ఇంటికి వచ్చారు. రూ.50 వేలు ఆర్థిక సాయం చేశా ను. నా ఆరోగ్యంపై వస్తున్న ఫేక్​న్యూస్​ను నమ్మొద్దు. కార్యకర్తలు ఆందోళన చెందవద్దు” అని విజ్ఞప్తి చేశారు. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన మీడియా సంస్థపై బంజారాహిల్స్​ పోలీస్ ​స్టేషన్​లో ఫిర్యాదు చేశానని తెలిపారు.