భవన నిర్మాణ కార్మికుల  సమస్యలు పరిష్కరించాలి: కొమ్మూరి ప్రతాప్‌‌‌‌రెడ్డి

భవన నిర్మాణ కార్మికుల  సమస్యలు పరిష్కరించాలి:  కొమ్మూరి ప్రతాప్‌‌‌‌రెడ్డి

జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లా కేంద్రంలో నిర్మించిన కాంట్రాక్టర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ను ఆదివారం కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ కొమ్మూరి ప్రతాప్‌‌‌‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సొంత బిల్డింగ్‌‌‌‌ నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు తాను ముందుంటానని హామీ ఇచ్చారు. అనంతరం బిల్డింగ్‌‌‌‌ కాంట్రాక్టర్స్​అసోసియేషన్‌‌‌‌ జనగామ జిల్లా అధ్యక్షుడు బాల్దె మల్లేశం మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తోట ప్రకాశ్‌‌‌‌, దోర్నాల శ్రీహరి, రమేశ్‌‌‌‌, జిట్ట నర్సింహులు, జన్నె శ్రీను, తోట సత్యం, అశోక్​, సిద్దులు, బర్ల శ్రీశైలం పాల్గొన్నారు.

కాంగ్రెస్‌‌‌‌ హయాంలోనే పేదల అభివృద్ధి

జనగామ, వెలుగు : పేదల పక్షాన పోరాడేది కాంగ్రెస్‌‌‌‌ పార్టీయేనని జనగామ ఎమ్మెల్యే క్యాండిడేట్‌‌‌‌ కొమ్మూరి ప్రతాప్‌‌‌‌రెడ్డి చెప్పారు. జనగామలోని 7, 8, 9 వార్డుల్లో ఆదివారం ప్రచారం నిర్వహించి మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్​మేనిఫెస్టోను రూపొందించిందన్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. లోకల్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ అయిన తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.