కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వేలంపాటలతో రూ. 2.64 కోట్ల ఆదాయం

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వేలంపాటలతో  రూ. 2.64 కోట్ల ఆదాయం

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో పలు దుకాణాలకు వేలంపాటలు నిర్వహించగా రూ.2 కోట్ల 64 లక్షల 32 ఆదాయం వచ్చింది. గురువారం ఆలయ ఈఓ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. 

కొబ్బరికాయల దుకాణం టెండర్‌‌ను రూ.48.50 లక్షలకు పొట్లచెరువు తిరుపతి, కొబ్బరి ముక్కల విక్రయం రూ.75 లక్షలకు మహేశ్, ఒడిబియ్యం, వస్త్రాలు, బండారు విక్రయం రూ.73.50 లక్షలకు వంశీ, ఎల్లమ్మ గుడి వద్ద ఒడిబియ్యం, వస్త్రాల విక్రయం రూ.23.30 లక్షలకు నరేశ్, స్వామివారి కోరమీసాలు, పూజా సామగ్రి విక్రయం రూ.17.31 లక్షలకు అరుణ, చెప్పుల స్టాండ్ టెండర్‌‌ను రూ.18 లక్షలకు బి.రామానాయక్, సులభ్ కాంప్లెక్స్ నిర్వహణ రూ.5.25 లక్షలకు మిశ్రా ఏజెన్సీ దక్కించుకున్నారు.