కొండా లక్ష్మణ్ బాపూజీపై యూనిటీ డాక్యుమెంట్రీ ఫిల్మ్.. పోస్టర్ ఆవిష్కరించిన సుద్దాల అశోక్ తేజ

కొండా లక్ష్మణ్ బాపూజీపై యూనిటీ డాక్యుమెంట్రీ ఫిల్మ్.. పోస్టర్ ఆవిష్కరించిన సుద్దాల అశోక్ తేజ

“కొండా లక్ష్మణ్ బాపూజీ..” చరిత్ర మరవలేని గొప్ప పోరాట యోధుడు ఇతను. నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పాటుపడిన తెలంగాణ బాపూజీ ఇతను. తన దృఢ సంకల్పంతో తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి గల్లీ నుంచి డిల్లీ వరకు పోరాటం చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇపుడు ఈ పోరాట యోధుడిపై యూనిటీ డాక్యుమెంట్రీ రూపొందించారు డైరెక్టర్ బడుగు విజయ్ కుమార్.

రేపు శనివారం (సెప్టెంబర్ 27న) కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత మసన చెన్నప్ప తో కలిసి నేషనల్ అవార్డు విన్నర్, ప్రముఖ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ యూనిటీ డాక్యుమెంట్రీ ఫిల్మ్ పోస్టర్ రిలీజ్ చేశారు.

►ALSO READ | OG Collections: పవన్ ప్రభంజనం.. ఓజీ డే1 కలెక్షన్స్ ప్రకటించిన మేకర్స్..ఎన్ని కోట్లంటే?

ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు అశోక్ తేజ. ఆయన మాట్లాడుతూ.. "బాపూజీ జీవన ప్రవాహాన్ని ఎంతో భావోద్వేగంగా చిత్రీకరించిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక అభినందనలు. యూనిటీ డాక్యుమెంట్రీ ఫిల్మ్ ను విడుదల చేయడం తన అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ ధ్వజస్తంభాలను భావితరాలు గుర్తుంచుకునేలా యూనిటీ చిత్రం రూపొందించారు. ఆడియన్స్ ఫ్రీగా చూసేలా యూట్యూబ్ లో అందుబాటులోకి రానుంది. ఈ గొప్ప చిత్రాన్ని చూసి ఆదరించాలని సుద్దాల అశోక్ తేజ విజ్ఞప్తి చేశారు.

ఈ మూవీలో మాస్టర్ భాను, మైమ్ మధు కీలక పాత్రల్లో నటించారు. చిరందాసు ధనుంజయ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది.