OG Collections: పవన్ ప్రభంజనం.. ఓజీ డే1 కలెక్షన్స్ ప్రకటించిన మేకర్స్..ఎన్ని కోట్లంటే?

OG Collections: పవన్ ప్రభంజనం.. ఓజీ డే1 కలెక్షన్స్ ప్రకటించిన మేకర్స్..ఎన్ని కోట్లంటే?

“ ఓజీ.. ఓజీ.. ఓజీ..” ఇప్పుడిదే బాక్సాఫీస్ మంత్రం. దుమ్మురేపే వసూళ్లతో పవర్ తుఫాను సృష్టిస్తోంది. గురువారం (సెప్టెంబర్ 25న) థియేటర్లలో రిలీజైన ఓజీ.. తొలిరోజు రికార్డ్ వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్గా రూ.154 కోట్ల గ్రాస్ సాధించి పవన్ స్టార్ సత్తా చాటింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

“ ఇది పవన్ కళ్యాణ్ సినిమా. చరిత్రను చెరిపేసే వసూళ్లతో OG దుమ్మురేపింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.154 కోట్ల గ్రాస్ సాధించి వేట కొనసాగిస్తోంది. మీ దగ్గరున్న థియేటర్లలో ఓజీ సంభవం చూసేయండి” అని మేకర్స్ తెలిపారు. అలాగే, ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.91 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కేవలం ప్రీమియర్స్ ద్వారానే తెలుగులో రూ.20.25 కోట్లు సాధించి ఓజీ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇండస్ట్రీ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం: ఓజీ ఫస్ట్ డే (సెప్టెంబర్ 25న) ఇండియా బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.70.75 కోట్ల నెట్ సాధించింది. బుధవారం వేసిన ప్రీమియర్స్ ద్వారానే రూ.20.25 కోట్లు వసూళ్లు చేసింది. ఈ విధంగా ప్రీమియర్స్ మరియు డే 1 గురువారం వసూళ్లు కలుపుకుని రూ.91 కోట్ల నెట్ చేసింది. తెలుగులోనే అత్యధికంగా రూ.70 కోట్లు సాధించి సత్తా చాటుకుంది ఓజీ. 

►ALSO READ | Anaganaga Oka Raju: బడా హీరోలకి పోటీగా.. సంక్రాంతి బరిలో నవీన్ పొలిశెట్టి.. 

OG తెలుగులో 69.35% థియేటర్ ఆక్యుపెన్సీ రేటును నమోదు చేసింది. ఆ తర్వాత తమిళంలో 18.36%, హిందీలో 10.37% మరియు కన్నడలో 9.19% ఉన్నాయి. ఈ చిత్రం భారతదేశం అంతటా తెలుగులో 4,161 షోలు ప్రదర్శించబడింది. తమిళంలో 226 కంటే ఎక్కువ షోలు ప్రదర్శించబడింది, హిందీలో 336 షోలు పడ్డాయి.

ఇండ్ల ఉంటే.. ఓజీ మూవీ ఉత్తర అమెరికా, ఆగ్నేయాసియాలోనూ వంటి దేశాల్లోనూ దుమ్మురేపింది. USAలో కేవలం పెయిడ్ ప్రీమియర్లతో 3 మిలియన్ డాలర్లకి పైగా (రూ.26 కోట్లు) సంపాదించింది. ఇలా ప్రీమియర్ షోల ద్వారా అత్యధిక కాసుల వర్షంతో ఓజీ సంచలనం సృష్టించింది. ఇప్పటికే, అల్లు అర్జున్ నటించిన అత్యంత భారీ చిత్రం 'పుష్ప 2' సాధించిన రికార్డులను సైతం వెనక్కినెట్టింది.