మెదక్ ​గడ్డపై కాంగ్రెస్​ జెండా ఎగరేస్తాం : కొండా సురేఖ

మెదక్ ​గడ్డపై కాంగ్రెస్​ జెండా ఎగరేస్తాం : కొండా సురేఖ

నర్సాపూర్, వెలుగు:  మెదక్​గడ్డపై కాంగ్రెస్​జెండా ఎగరేస్తామని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో  నియోజకర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి సురేఖ హాజరై ప్రసంగించారు. 

నీలం మధు ముదిరాజ్​ను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మధు బీఎస్పీ నుంచి పోటీ చేసినా 45 వేల ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు. బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్ కు ఓటు వేసినట్టేనన్నారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ.. ఉప సర్పంచ్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎదిగానని ప్రజలందరు ఆశీర్వదించాలని కోరారు. 

తనను పార్లమెంట్​కు పంపిస్తే అధిక నిధులు తీసుకొచ్చి మెదక్​ను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మైనంపల్లి హన్మంతరావు, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, ఎంపీపీ జ్యోతి, మల్లేశం, అశోక్, మణికంఠ, సుహాసిని రెడ్డి; రవీందర్​రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, సుజాతారెడ్డి పాల్గొన్నారు.