కడియం శ్రీహరి మచ్చ లేని నాయకుడు: మంత్రి కొండా సురేఖ

కడియం శ్రీహరి మచ్చ లేని నాయకుడు: మంత్రి కొండా సురేఖ

కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య భారీ మెజారిటీతో ఎంపీగా గెలువబోతున్నారన్నారు మంత్రి కొండా సురేఖ. ఒకరు భూకబ్జా రాయుడు, మరొకరు అక్రమాలకు పాల్పడిన వ్యక్తి.. ఇద్దరిపై అవినీతి మచ్చ లేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న కడియం శ్రీహరి కూతరు కావ్య పోటీ చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో బడా నాయకులు అనేక తప్పులు చేసి... ఇప్పుడు ఓడి పోతున్నామనే  ఫ్రస్టేషన్ లో ఉండి మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండే పార్టీ అని.. ప్రజల గురించి ఆలోచించే పార్టీ అని అన్నారు. 

ఏప్రిల్ 24వ తేదీ బుధవారం కడియం కావ్య వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా చూసి కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలనా చేసిందని విమర్శించారు.  మోదీ సర్కార్ వల్ల పేదలకు ఏం న్యాయం జరుగలేదన్నారు.  తెలంగాణ ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తున్నామో.. కేంద్రంలోనూ అలాగే చేయాలంటే కాంగ్రెస్ గెలువాలన్నారు.  బీఆర్ఎస్, బేజేపీ అభ్యర్థులపై కడియం కావ్య భారీ మెజారిటీతో గెలస్తుందని మంత్రి సురేఖ అన్నారు.

Also Read:కేసీఆర్‌ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతుండు.. మంత్రి ఉత్తమ్ కౌంటర్