కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్తాననడం స్వాగతిస్తున్నాం

కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్తాననడం స్వాగతిస్తున్నాం

తాను టీఆరెస్ లో ఉన్నప్పుడు నీటి ప్రాజెక్టుల కోసం బాగానే ఫోకస్ చేశారన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు విషయంలో నా అభిప్రాయం మేరకు 10టీఎంసీ ఉన్న ప్రాజెక్టు 20 టీఎంసీకి పెంచారని తెలిపారు. లక్ష్మీదేవి పల్లి-అంతారం ప్రాజెక్టు కట్టాలని గతంలో ప్రణాళికలు చేశారని.. కొన్ని రోజుల తర్వాత‌ లక్ష్మీదేవి పల్లి-అంతారం రెండు అటకెక్కాయన్నారు. వికారాబాద్ జిల్లాకు నీళ్లు ఇస్తే.. కేసీఆర్ కి గుడి కట్టాలని అనుకున్నామని.. వికారాబాద్ లో నీటి ప్రాజెక్టుల నిర్మాణం జారగకపోగా-ఏపీ సీఎం జగన్ నీళ్లు తీసుకుపోతే కేసీఆర్ చూస్తూ ఉన్నారన్నారు.

కేసీఆర్ చెప్పింది చేయడు అనే అనుమానాలు ఉన్నాయని.. ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కేసీఆర్ కి నీటి ప్రాజెక్టుల పై ఇంజనీర్ల కంటే ఎక్కువ తెలుసని.. పోతిరెడ్డిపాడు వల్ల టీఆరెస్ పార్టీ నష్టం అయితది..అయినా కేసీఆర్ సైలెంట్ గా ఉన్నడంటే ఇంకా ఏదో ఉందన్నారు. ఆ ఒప్పందం ఎందో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్తాననడం స్వాగతిస్తున్నామని తెలిపారు కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి.