అంజన్న పార్కింగ్ స్థలంపై లొల్లి

అంజన్న  పార్కింగ్ స్థలంపై లొల్లి
  • పార్కింగ్ కోసం స్థలం చదును చేయడంపై వివాదం
  • ఫారెస్ట్, ఎండోమెంట్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల పరస్పర నోటీసులు 
  • తమవంటే తమవంటున్న రెండు శాఖలు
  • సరిహద్దులు గుర్తించకపోవడంతోనే వివాదం

జగిత్యాల, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయ భూములకు సంబంధించి రెండు శాఖల మధ్య వివాదం నెలకొంది. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్య ఎదురవుతోంది. ఈక్రమంలో ఆలయ అధికారులు కొండగట్టులోని వై జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం స్థలం చదును చేయడంపై వివాదం నెలకొంది. ఆ భూములు ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని ఆ శాఖ అధికారులు అభ్యంతరం చెబుతూ నోటీసులు జారీ చేశారు. దీంతో ఎండోమెంట్ అధికారులు సైతం తమ భూముల్లో రోడ్డు వేశారంటూ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖకు నోటీసులు పంపారు. రెండు డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల మధ్య పరస్పర నోటీసులు వివాదం తీవ్రమవుతోంది. 

అభివృద్ధి పనులకు ఆటంకం

కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. దీంతో పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం వై జంక్షన్ వద్ద ఉన్న సుమారు ఎకరం పైగా స్థలాన్ని ఇటీవల ఆలయ అధికారులు చదును చేశారు. ఈ స్థలం సమీపంలో ఫారెస్ట్ భూములు ఉండగా.. 

వీటికి సరిహద్దులు గుర్తించలేదు. దీంతో ఈ స్థలం తమ పరిధిలోకి వస్తుందని ఫారెస్ట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ భూములను ఆనుకొని ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు అర్బన్ పార్క్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గజిబో( కూర్చోవడానికి ప్రత్యేకంగా తయారుచేసిన స్థలం), వాచ్​టవర్ వంటి నిర్మాణాలు చేపట్టారు. 

కాగా ఈ అర్బన్ పార్క్ నిర్మించిన భూములు తమ పరిధిలోకి వస్తాయని ఆలయ అధికారులు అంటున్నారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఆ భూముల్లో ఫారెస్ట్ అధికారులు రోడ్డు నిర్మించారని ఆలయ అధికారులు కౌంటర్ నోటీసులు జారీ చేశారు. దీంతో వివాదం ముదిరి రోడ్డు పనులు ఆపాల్సి 
వచ్చింది. 

 అంజన్న ఆలయానికి 651.24 ఎకరాలు

కొండగట్టులో అంజన్న ఆలయానికి సుమారు 651.24 ఎకరాల భూములు ఉన్నాయి. అప్పటికే ఆలయ భూములకు హద్దులు ఏర్పాటు చేయకపోవడంతో సుమారు 50 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. గత సర్కార్ హయాంలో నిర్వహించిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ శాఖ ఈ భూములను గుర్తించింది. కాగా ఫారెస్ట్,  దేవాదాయ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాయింట్ సర్వే నిర్వహించలేదు. దీంతో ఈ భూములకు సంబంధించి సరిహద్దులు గుర్తించకపోవడంతో సమస్య తలెత్తుతోంది. రెండు శాఖల మధ్య నెలకొన్న ఈ వివాదంతో ఆలయ అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. 

వారం రోజుల్లో పనులు చేపడతాం

కొండగట్టు ఆలయానికి సంబంధించిన భూములను ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. వై జంక్షన్ వద్ద భక్తుల వాహనాల పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్థలం ఏర్పాటుచేస్తాం. దీంతోపాటు ఆలయ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం. మరో వారం రోజుల్లో సరిహద్దు ఏర్పాటు చేసే పనులు చేపడతాం.-శ్రీకాంత్ రావు, కొండగట్టు ఆలయ ఈవో

 హద్దులు ఏర్పాటు చేస్తాం 

కొండగట్టు పరిసర ప్రాంతాల్లో అటవీ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఫారెస్ట్ భూముల్లోకి చొచ్చుకు వచ్చి కొండగట్టు టెంపుల్ సిబ్బంది పార్కింగ్ స్థలం కోసం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. వీరిని అడ్డుకొని నోటీసులు జారీ చేశాం. జాయింట్ సర్వే అనంతరం భూముల హద్దులు నిర్ణయిస్తాం.-మొయినుద్దీన్, ఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో కొడిమ్యాల