సర్వం కోల్పోయినా కనికరం చూపడం లేదు

సర్వం కోల్పోయినా కనికరం చూపడం లేదు
  • ధర్నాకు దిగిన కొండపోచమ్మ భూ నిర్వాసితులు

ములుగు, వెలుగు: కొండపోచమ్మ సాగర్​నిర్మాణం కోసం సర్వం కోల్పోయి రోడ్డున పడ్డా ప్రభుత్వం తమను కనికరించడంలేదని భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ములుగు మండలంలోని ఆర్అండ్ ఆర్ కాలనీ మామిడియాల గ్రామంలో రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిహారం కోసం అధికారులు, నాయకుల చుట్టూ ఏండ్ల తరబడి తిరుగుతున్నా తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

కొంతమంది నిర్వాసితులు అనారోగ్యానికి గురై చనిపోతున్నా ప్రభుత్వం ప్యాకేజీల మాట ఎత్తడంలేదన్నారు. ఊరికి దూరంగా రేకుల షెడ్లలో బతుకుతున్నామని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు ఇవ్వాల్సిన ప్యాకేజీలను మంజూరు చేయాలని డిమాండ్​చేశారు. బీఆర్ఎస్​హయాంలోనే తమకు న్యాయం జరగలేదని కనీసం కాంగ్రెస్​ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని కోరారు.