సంచలనం సృష్టిస్తున్న ‘కూ’ యాప్

సంచలనం సృష్టిస్తున్న ‘కూ’ యాప్

ట్విట్టర్ కి పోటీగా తీసుకొచ్చిన దేశీ యాప్ ‘కూ’కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ యాప్ ను లాంచ్ చేస్తున్నారు. తాజాగా బ్రెజిల్ లో కూ యాప్ ను లాంఛ్ చేశారు. ప్రాంతీయ భాషలో (పోర్చుగీస్) అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ రికార్డ్ క్రియేట్ చేసింది. బ్రెజిల్ లో అయితే ఒక్కరోజులోనే ఒక మిలియన్ డౌన్ లోడ్ చేసుకున్నారు. 

కూ యాప్ ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 11 భాషల్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మరికొన్ని దేశాల్లో, మరిన్ని భాషల్లో కూ యాప్ తీసుకెళ్తున్నట్టు ప్రకటించారు. మన దేశంలో ఇప్పటి వరకు 50 మిలియన్లకు పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ట్విట్టర్ లో వస్తున్న పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ‘కూ’ వంటి చాలా యాప్ లను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు.