కూ యాప్‍లో ఇక నుంచి డబ్బులు కూడా ఇస్తారు

కూ యాప్‍లో ఇక నుంచి డబ్బులు కూడా ఇస్తారు

భారతదేశ స్వంత మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్, ట్విట్టర్ ప్రత్యర్థి కూ జూన్ 15న కూ ప్రీమియంను ప్రారంభించింది. ఇది క్రియేటర్స్ కు వారి కంటెంట్‌తో డబ్బు ఆర్జించడానికి, అభిమానులతో సన్నిహితంగా ఉండటానికి అవకాశాన్ని అందిస్తోంది. కూ (Koo) ప్రీమియంతో, క్రియేటర్‌లు తమ సబ్‌స్క్రైబర్‌లకు ప్రత్యేకమైన కంటెంట్‌ను అందించే అవకాశం ఉంటుంది. దీని కోసం వారు వారంవారీ లేదా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. క్రియేటర్స్ టెక్స్ట్, వీడియోలు, ఫొటోలతో సహా వారి కంటెంట్‌ను లేబుల్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. వారి చందాదారుల కోసం పోస్ట్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. వారు తమ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌లను కస్టమైజ్ కూడా చేసుకోవచ్చని, వారి స్వంత ధరలను సెట్ చేసుకోవచ్చని కూ తెలిపింది. దీని వల్ల సబ్‌స్క్రిప్షన్ కంటెంట్‌పై క్రియేటర్స్ పూర్తి నియంత్రణను కలిగి ఉండవచ్చని కంపెనీ తెలిపింది.

ఈ చెల్లింపు సేవ ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉంది. కూ (Koo) దేశంలోని 20 మంది క్రియేటర్స్ తో గత నెలలో ఈ ఫీచర్‌ టెస్టింగ్ ప్రక్రియను మొదలుపెట్టింది. రాబోయే నెలల్లో కూ ప్రీమియమ్‌లో జర్నలిస్టులు, బాలీవుడ్ నటులు, క్రికెటర్లు వంటి వెరిఫైడ్ ప్రొఫైల్‌లను ఆన్‌బోర్డ్ చేసి వారి సబ్‌స్క్రైబర్‌లతో ఇంటరాక్ట్ చేయడానికి కూ ప్లాన్ చేస్తోంది.

“కూ అనేది అత్యంత సమగ్రమైన సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో ఒకట. ఈ రోజు కూని తయారు చేయడంలో పాత్ర పోషిస్తున్న ప్రతి ఒక్కరికీ న్యాయంగా ఉన్నందుకు మేము గర్విస్తున్నాము. మా క్రియేటర్స్ - Kooని విజయవంతం చేయడంలో గొప్ప పాత్రను పోషిస్తున్నారు. కంటెంట్ క్రియేషన్‌ను ప్రజాస్వామ్యీకరించడానికి, దేశవ్యాప్తంగా ఉన్న క్రియేటర్‌లు తమ కంటెంట్‌ను మానిటైజ్ చేయడానికి మేము ప్రారంభించే అనేక ప్రోగ్రామ్‌లలో Koo ప్రీమియం మొదటిది" అని కూ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు.

ఎలోన్ మస్క్ ఇటీవలే మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వారి ప్రత్యుత్తరాలలో ప్రదర్శించబడే ప్రకటనల కోసం కంటెంట్ సృష్టికర్తలకు 5 మిలియన్ల డాలర్ల మొదటి బ్లాక్ చెల్లింపుతో చెల్లించడం ప్రారంభిస్తుందని ప్రకటించారు. క్రియేటర్ తప్పనిసరిగా వైరిఫైడ్ అయి ఉండాలని, వెరిఫైడ్ వినియోగదారులకు మాత్రమే (యాడ్స్)ప్రకటనలు అందించబడతాయని కూడా అయన చెప్పారు.

Facebook పేరెంట్ కూడా ఇటీవల భారతదేశంలో Meta Verifiedని ప్రారంభించింది. మెటా వెరిఫైడ్ అనేది ప్రభుత్వ IDతో అకౌంట్ వెరిఫికేషన్.. అకౌంట్ సపోర్టుతో కూడిన కొత్త సబ్‌స్క్రిప్షన్ బండిల్ అని సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ప్రకటించింది. మెటా వెరిఫైడ్ అనేది చెల్లింపు ధృవీకరణ వ్యవస్థ(paid verification system). ఇది ట్విట్టర్ బ్లూ టిక్ తో ఎలాన్ మస్క్ చేసినట్లే ఉంటుంది. మార్క్ జుకర్‌బర్గ్ యాజమాన్యంలోని కంపెనీ మెటా వెరిఫైడ్‌ను ప్రవేశపెట్టడానికి ముందు వెరిఫైడ్ ఖాతాల కోసం వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను అలాగే ఉంచుతుందని ప్రకటించింది.