ఓటీటీలోకి రియల్ క్రైమ్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి రియల్ క్రైమ్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ మధ్య కాలంలో థియేటర్లో సినిమా చూడటానికి ప్రేక్షకులు పెద్దగా అసక్తి చూపడం లేదు..దానికి కారణం లేకపోలేదు. ఒక మంచి సినిమాకి ఫ్యామిలీతో వెళ్ధాం అంటే చాలా ఖర్చు అవుతుంది..అక్కడ సినిమా టికెట్ రేటు కంటే స్నాక్స్ రేటు అంతకు మించి ఉంటున్నాయి.దీంతో సినీ ప్రేక్షకులు ఓటీటీ మీద ఎక్కువ అసక్తి చూపిస్తున్నారు. 

అసలు విషయానికి వస్తే.. 

ఎర్రచందనం స్మగ్లర్ అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చే పేరు వీరప్పన్. ఆ వీరప్పన్ జీవిత చరిత్ర మీద ఇప్పటికే చాలా సినిమాలు, డాక్యుమెంటరీలు వచ్చాయి. అయితే ఆయన జీవితంలో ఇంకా చెప్పాల్సిన  విషయాలు చాలా లోతుగా ఉండటంతో..మేకర్స్ ఆయన స్టోరీని తెరకెక్కించడానికి ముందుకొస్తున్నారు. 

ఇప్పుడు అదే బాటలోనే..డైరెక్టర్ శరత్ జోతి(Sharath Jothi)..'కూసే మునిస్వామి వీరప్పన్'(Koose Munisamy Veerappan) అనే వెబ్ సిరీస్‌ని తెరకెక్కించారు. త్వరలో ఈ వెబ్ సీరీస్ జీ5 (Zee5) లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. వచ్చే నెల డిసెంబర్ 8న తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, హీందీ భాషలలో అందుబాటులోకి రానుంది.

తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మూడు దశాబ్ధాల పాటు పోలీసులని ముప్పుతిప్పలు పెట్టి..చివరికి ఆ పోలీసుల చేతిలోనే ఎన్‌కౌంటర్‌‌లో చనిపోయిన వీరప్పన్ జీవిత చరిత్ర అంటే తెలియని వారుండరు. అయిన సరే ఆడియన్స్ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.