'నాటు నాటు'పై కొరియా ఎంబసీ స్టాఫ్ డ్యాన్స్

'నాటు నాటు'పై కొరియా ఎంబసీ స్టాఫ్ డ్యాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డులతో పాటు, ఎన్నో రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఆస్కార్ నామినేషన్ లోనూ చోటు దక్కించుకున్న ఈ సినిమా.. ఇటీవల  హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ మూవీ.. ఇప్పటికే కోట్లలో కలెక్షన్లను రాబట్టి ది బెస్ట్ ఇండియన్ మూవీలలో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ కూడా ఎంత హిట్టయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే కొరియా ఎంబసీ ఇండియా సిబ్బంది ఈ సాంగ్ పై చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరో విశేషమేమిటంటే వారితో పాటు కొరియా రాయబారి చాంగ్ జే-బోక్‌ కూడా ఈ పాటకు తగ్గ స్టెప్పులు వేస్తూ అలరించారు. ఈ వీడియోను కొరియ ఎంబసీ ఇండియా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. ప్రధాని మోడీ ఆ ట్వీట్ ను రీట్వీట్ చేశారు. వారి ప్రయత్నాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు.