కొరియన్ మహిళకు వేధింపులు

కొరియన్ మహిళకు వేధింపులు

న్యూఢిల్లీ: సౌత్ కొరియాకు చెందిన మహిళా వ్లాగర్​ను ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. కొరియన్ మహిళ కెల్లీ మహారాష్ట్రలోని ఓ మార్కెట్​లో స్థానికులతో మాట్లాడుతూ వీడియో చేస్తున్న టైమ్​లో అక్కడికి ఓ వ్యక్తి వచ్చాడు. సడెన్​గా కెల్లీ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. అదే టైమ్​లో ఆమె వెనకాల మరో వ్యక్తి వచ్చి నిలుచున్నాడు. దీంతో కెల్లీ భయపడిపోయింది.

 ‘ఇక నేను ఇక్కడి నుంచి పారిపోవాలి’ అంటూ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదంతా తాను చేస్తున్న వీడియోలో రికార్డు కాగా, దాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియో వైరల్ అయింది. తాను కొంత దూరం వెళ్లాక కూడా ఆ వ్యక్తి బైక్ పై ఫాలో అయ్యాడని, లిఫ్ట్ ఇస్తానని చెప్పాడని.. అయితే ఇల్లు దగ్గరే ఉందని చెప్పి, తాను తప్పించుకున్నానని కెల్లీ పోస్టులో పేర్కొంది.