‘సారంగ దరియా’ పాట పాడిన కొరియా యువతి

V6 Velugu Posted on Sep 12, 2021

  • కొరియన్ యువతి పాడిన తెలుగు పాట  వీడియో వైరల్
  • 9 లక్షలకు చేరిన వ్యూస్..

శేఖర్ కమ్ముల సినిమా ‘లవ్ స్టోరీ’ ఎప్పుడు రిలీజ్ అవుతుందో గాని.. అభిమానుల కోరిక మేరకు విడుదల చేసిన సారంగ దరియా పాట క్రేజ్ ప్రపంచమంతా షేక్ చేస్తోంది. తెలుగు సినిమా పాటల చరిత్రలో ఏ పాటకు లేనన్ని వ్యూస్ తో సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్న ఈ పాట ఇప్పుడు విదేశీయులను కూడా ఊపేస్తోంది. దీనికి నిదర్శనం తాజాగా కొరియన్ యువతి పాడిన పాటగా చెప్పుకోవచ్చు. 
సారంగ దరియా పాటలోని సాహిత్యం, చరణాలు.. పల్లవులు.. పాడిన యాస అన్ని కలిపి విదేశీయులను సైతం మెస్మరైజ్ చేస్తోంది. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా హిట్టయిన టాలీవుడ్  పాటల సరసన సారంగ దరియా ఒకటిగా నిలుస్తోంది. జానపద శైలిలో మంగ్లి పాడిన పాటకు విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొరియా యువతి మన తెలుగు భాషలోనే పాడడంతో  మరో సారి ట్రెండింగ్ అవుతోంది. సారంగ దరియా పాట కొరియా దేశంలో కూడా ఊపేస్తోంది. కొరియా యువతి పాడి విడుదల చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రంలోని ఈ సారంగ దరియా పాటకు ఫిదాఅయిన కొరియన్ యువతి మన తెలుగు భాషలోనే అదే యాసలో పాడి  అప్ లోడ్ చేసింది. యూట్యూబ్ లో విడుదల చేసిన ఈ వీడియోకు దాదాపు 9 లక్షల మంది వీక్షించారు. ఆ యువతి పేరు తెలియరాలేదు కానీ.. తన యూట్యూబ్ చానల్లో మాత్రం కొరియన్ జీ1 అని కనిపిస్తోంది. 

 

Tagged Saranga Dariya Song, , Sekhar kammula movie, sekhar kammula love story, korean lady, korean woman, korean g1 youtube channel, saranga dariaya sung by korean lady

Latest Videos

Subscribe Now

More News