కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం : కల్వకుంట్ల సంజయ్

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం : కల్వకుంట్ల సంజయ్

జగిత్యాల టౌన్, వెలుగు: రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఏమీ జరగలేదని, ప్రజలకు చేయాల్సిన పనులు వదిలి బీఆర్ఎస్​పై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు. సోమవారం బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ జిల్లా ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్​ పాలకులు ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌, కాళేశ్వరం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ విలువైన భూములను సీఎం అమ్మకానికి పెట్టాడని హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ అభివృద్ధి దృష్టితో నిర్మించిన ఫార్మాసిటీ 14 వేల ఎకరాలను ఫ్యూచర్ సిటీ పేరిట అమ్మే పనిలో పడిన ప్రభుత్వానికి యువత ఉపాధి, పరిశ్రమల అభివృద్ధి గురించి ఎలాంటి బాధ్యత లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రూ.ఐదు లక్షల కోట్ల స్కామ్ చేశారని ఆరోపించారు. 

 కోరుట్ల,వెలుగు: చెస్ నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో మేధో సంపత్తి పెరుగుతుందని ఎమ్మెల్యే కల్వకంట్ల సంజయ్ పేర్కొన్నారు. సోమవారం కోరుట్లలోని గర్ల్స్​ హైస్కూల్‌‌‌‌లో చెస్  నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ స్పాన్సర్ చేసిన చెస్ బోర్డులను ఎమ్మెల్యే స్టూడెంట్స్‌‌‌‌కు అందజేశారు. ఈ సందర్భంగా చెస్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు.