సిఫి టెక్నాలజీస్​లో కోటక్‌‌‌‌​ ఆల్టర్నేట్​ ఫండ్​ పెట్టుబడులు

సిఫి టెక్నాలజీస్​లో కోటక్‌‌‌‌​ ఆల్టర్నేట్​ ఫండ్​ పెట్టుబడులు

ముంబై : డేటా సెంటర్స్​ బిజినెస్​లోని సిఫి టెక్నాలజీస్​లో అదనంగా మరో రూ. 600 కోట్లను కోటక్‌‌‌‌​ ఆల్టర్నేట్​ అసెట్​ మేనేజర్స్​ ఇన్వెస్ట్​ చేస్తోంది. సిఫి  ఇన్ఫినిట్ స్పేసెస్ (ఎస్​ఐఎస్​ఎల్) లో కోటక్‌‌‌‌​ డేటా సెంటర్​ పండ్​ ఈ పెట్టుబడి పెట్టనుంది.

దీంతో సిఫిలో కోటక్‌‌‌‌​ పెట్టుబడులు రూ. 1,600 కోట్లకు పెరుగుతాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో డేటా సెంటర్స్​ విస్తరణకు, రెన్యువబుల్​ ఎనర్జీ కోసం సిఫి ఈ మొత్తాన్ని వెచ్చిస్తోంది.  కంపల్సరీ కన్వర్టబుల్​ డిబెంచర్ల రూపంలో కోటక్‌‌‌‌​ ఇన్వెస్ట్​ చేస్తోంది.