న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2)లో ఏడాది లెక్కన 2.7శాతం తగ్గి రూ.3,253 కోట్లకు చేరింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ.3,344 కోట్ల ప్రాఫిట్‌ను సాధించింది.
అయితే, క్యూ2లో బ్యాంక్ నెట్ ఇంటరెస్ట్ ఆదాయం (ఎన్‌ఐఐ) 4శాతం పెరిగి రూ.7,311 కోట్లకు చేరగా, నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ (ఎన్‌ఐఎం) 4.54శాతానికి మెరుగుపడింది. బ్యాంకిచ్చిన అప్పులు అంటే నెట్ అడ్వాన్సులు సెప్టెంబర్ చివరి నాటికి ఏడాది లెక్కన 16 శాతం పెరిగి రూ.4.62 లక్షల కోట్లకు ఎగిశాయి.
జీఎన్‌పీఏ రేషియో 1.39శాతంగా, నెట్‌ఎన్‌పీఏ రేషియో 0.32శాతంగా నమోదైంది. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 14శాతం పెరిగి రూ.5.10 లక్షల కోట్లకు చేరాయి. కరెంట్ డిపాజిట్లు రూ.70,220 కోట్లుగా, ఫిక్స్‌డ్ రేట్ సేవింగ్స్ రూ.1.13 లక్షల కోట్లుగా, టర్మ్ డిపాజిట్లు రూ.3.11 లక్షల కోట్లుగా ఉన్నాయి.
