కోటక్​ నుంచి గ్లోబల్​ సర్వీస్​ అకౌంట్​

కోటక్​ నుంచి గ్లోబల్​ సర్వీస్​ అకౌంట్​

న్యూఢిల్లీ :  కోటక్​ మహీంద్రా బ్యాంక్​ సర్వీస్​ ఎక్స్​పోర్ట్ సెక్టార్​ కోసం గ్లోబల్​ సర్వీస్​ అకౌంట్​ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఏస్​, ఎలైట్​అనే వేరియంట్లు ఉంటాయి.  ఇది సేవా ఎగుమతి రంగం ప్రత్యేకమైన బ్యాంకింగ్ అవసరాలను తీర్చుతుంది.   ఏస్​, ఎలైట్​ వేరియంట్‌‌లు వాణిజ్యం,  ఫారెక్స్ లావాదేవీల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తాయి.   గ్లోబల్ సర్వీస్ ఖాతా కన్సల్టెన్సీ, సాఫ్ట్‌‌వేర్, బీపీఓ వంటి రంగాలకు సేవలను అందిస్తుంది. 

ట్రేడ్  ఫారెక్స్ సొల్యూషన్స్, రూ.2 కోట్ల వరకు   ఓవర్‌‌డ్రాఫ్ట్ పరిమితి, ఖాతా ఉద్యోగులకు జీరో- బ్యాలెన్స్ జీతం ఖాతాలు వంటి ఫీచర్లు దీని సొంతం.  ఉద్యోగులకు ప్రయారిటీ బ్యాంకింగ్ సేవలతో పాటు కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్లు, ఉద్యోగులకు ప్రోగ్రామ్ పెర్క్‌‌లు,  ప్రీమియం క్రెడిట్ కార్డ్‌‌లకు జీవితకాల యాక్సెస్‌‌ను అందిస్తుంది. క్యాష్‌‌బ్యాక్, ఇంధన సర్‌‌ఛార్జ్ మినహాయింపులు, లాంజ్ యాక్సెస్ కూడా ఉంటాయి. ఎఫ్​డీలపై ఏడుశాతం వడ్డీ ఇస్తారు.