 
                                    - 5 వేలు ఫైన్విధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని రైస్ గ్రాండ్ రెస్టారెంట్ లో కుళ్లిన మాంసంతో బిర్యానీలు చేస్తున్నారనే కంప్లైంట్‌తో తనిఖీలు చేసి రెస్టారెంట్‌కు రూ. 5 వేల జరిమానా విధించినట్లు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు శనివారం తెలిపారు. మున్సిపల్ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రామవరం ప్రాంతానికి చెందిన ఓ యువతి రైస్ గ్రాండ్ రెస్టారెంట్‌లో బిర్యానీ తెచ్చుకుంది. బిర్యాని నుంచి కుళ్లిన వాసన రావడంతో బాధితులు రెస్టారెంట్ యజమానులను అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు.
 వారు ఇచ్చిన కంప్లైంట్‌తో రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించగా కుళ్లిన మాంసంతో చేసినట్లు తేలడంతో  రూ. 5 వేలు ఫైన్ వేసినట్టు పేర్కొన్నారు.  కుళ్లిన మాంసంతో బిర్యానీ తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్న  రైస్ గ్రాండ్ రెస్టారెంట్‌ను సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 
 

 
         
                     
                     
                    