కోజికోడ్ ప్లెయిన్ క్రాష్ యాక్సిడెంట్ కాదు.. మర్డర్!

కోజికోడ్ ప్లెయిన్ క్రాష్ యాక్సిడెంట్ కాదు.. మర్డర్!

న్యూఢిల్లీ: కోజికోడ్‌లో శుక్రవారం జరిగిన ఎయిర్‌‌క్రాఫ్ట్‌ క్రాష్‌ ఘటన కలకలం రేపుతోంది. పాట్నా, జమ్మూ ఎయిర్‌‌పోర్ట్స్‌లో ఇలాంటి ఘటనలు జరిగే ప్రమాదం పొంది ఉందని ఎక్స్‌పర్ట్స్‌ హెచ్చరిస్తున్నారు. కాలికట్ (కోజికోడ్) ఎయిర్‌‌పోర్ట్‌ ల్యాండింగ్‌కు సేఫ్ కాదని తొమ్మిదేళ్ల క్రితమే తాను హెచ్చరించానని కెప్టెన్ మోహన్ రంగనాథన్ అన్నారు. ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏర్పాటు చేసిన సేఫ్టీ అడ్వయిజరీ కమిటీలో మెంబర్‌‌గా ఉన్నారు. తన దృష్టిలో హెచ్చరికలను పట్టించుకోలేదని, అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని రంగనాథన్ మండిపడ్డారు.

‘కోజికోడ్ ఎయిర్‌‌పోర్ట్‌లోని రన్‌వేపై 70 మీటర్ల మేర డ్రాప్ ఉంది. అదే మంగళూరులో అయితే 100 మీటర్లకుపైనే డ్రాప్ ఉంటుంది. ఎయిర్‌‌క్రాఫ్ట్‌ ఓవర్‌‌రన్ అయితే తప్పించుకునే చాన్స్ లేదు. ఇలాంటి మేజర యాక్సిడెంట్‌లు పాట్నా, జమ్మూ ఎయిర్‌‌పోర్ట్‌లో కూడా అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఆ రెండు ఎయిర్‌ ‌ఫీల్డ్స్‌ కూడా చాలా డేంజరస్. అక్కడ ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ లేవు’ అని రంగనాథన్ పేర్కొన్నారు.