ఫ్యూచర్‌‌లో ప్రేమకు కూడా ఇన్సూరెన్స్‌‌ : కృతి శెట్టి

ఫ్యూచర్‌‌లో ప్రేమకు కూడా ఇన్సూరెన్స్‌‌ : కృతి శెట్టి

‘ఉప్పెన’ తర్వాత తాను  చేసిన ఫుల్‌‌లెంగ్త్ లవ్ స్టోరీ  ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అని, ఈ చిత్రం అందరికీ రిలేట్ అయ్యే మంచి కమర్షియల్ ఎంటర్‌‌టైనర్ అని చెప్పింది హీరోయిన్ కృతి శెట్టి.  ప్రదీప్ రంగనాథన్‌‌కు ఆమె జంటగా నటించిన ఈ చిత్రాన్ని విఘ్నేష్ శివన్ రూపొందించగా, నయనతార నిర్మించింది. ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల  కానుంది. ఈ సందర్భంగా కృతి శెట్టి చెప్పిన విశేషాలు.

‘‘ఈ చిత్రంలోని ప్రేమకథ చాలా ఫ్రెష్‌‌గా ఉంటుంది.  విఘ్నేష్ శివన్  కథ చెప్పినప్పుడు నాకు బాగా  కనెక్ట్ అయ్యింది.  ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని షేర్స్ వచ్చాయి అని కౌంట్ చేసుకుంటున్నారు. అది చాలామందికి హార్ట్‌‌కు దగ్గరగా ఉంటుంది. రియల్‌‌గా అనిపించే క్యారెక్టర్‌‌ని సినిమాటిక్‌‌గా చూపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ చేయడం  మంచి ఎక్స్‌‌పీరియెన్స్.  -ఈ జనరేషన్‌‌లో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కానీ ఫోన్ లేకుండా ఉండడం చాలా కష్టం. అలాంటి క్యారెక్టర్ చేశా.  

2040 ఫ్యూచరిస్టిక్‌‌గా ఉన్న  కథ అందరికీ రిలేటబుల్‌‌గా ఉంటుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి.  ఇప్పుడు బాడీలో ప్రతి పార్ట్‌‌ని ఇన్సూరెన్స్ చేస్తున్నారు. ఫ్యూచర్‌‌లో లవ్ కూడా  ఇన్సూరెన్స్‌‌లో భాగం కావచ్చు. సినిమాలో ఈ ఐడియా చాలా ఇంటరెస్టింగ్‌‌గా ఉంటుంది.  ప్రదీప్ రంగనాథన్   స్వీట్ పర్సన్. ఆయన జడ్జ్‌‌మెంట్ చాలా బాగుంటుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఎస్‌‌జే సూర్య గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌‌పీరియెన్స్.  ఈ సినిమాతో నయనతార గారితో మంచి అనుబంధం ఏర్పడింది.  సినిమాలో చూస్తే ఒక లేడీ బాస్​లా ఉంటారు, కానీ బయట చాలా స్వీట్ పర్సన్.  కెరీర్ గురించి ఆమె కొన్ని టిప్స్ కూడా  ఇచ్చారు.  ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌‌లో  ఒక సినిమా చేయబోతున్నా.  అలాగే తమిళంలో  ఒక సినిమా డిస్కషన్‌‌లో ఉంది’’.