500 అడుగుల వరకు ఓకే.. వాటర్​ రిలీజ్​ ఆర్డర్​ ఇచ్చిన కేఆర్ఎంబీ

500 అడుగుల వరకు ఓకే.. వాటర్​ రిలీజ్​ ఆర్డర్​ ఇచ్చిన కేఆర్ఎంబీ

హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్​ప్రాజెక్టు నుంచి తాగునీటిని తీసుకునేందుకు కృష్ణా రివర్​మేనేజ్​మెంట్​బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టులో 500 అడుగుల వరకు నీటిని తీసుకోవచ్చని గురువారం విడుదల చేసిన వాటర్​రిలీజ్​ఆర్డర్​లో పేర్కొంది. ఈ నెల 12న జలసౌధలో బోర్డు త్రీ మెంబర్​కమిటీ మీటింగ్​నిర్వహించగా, రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

ఈ నేపథ్యంలో బోర్డు తాజాగా వాటర్​ రిలీజ్​ఆర్డర్ జారీ చేసింది. ‘‘ప్రస్తుతం సాగర్​లో 511 అడుగుల నీటి మట్టం ఉంది. 500 అడుగుల వరకు నీటిని తీసుకోవచ్చు. 500 అడుగుల వరకు అంటే 14.195 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో తాగునీటి కోసం తెలంగాణకు 8.69 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయించాం. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కేవలం తాగు నీటి కోసమే జలాలను వాడుకోవాలి” అని అందులో పేర్కొంది. రెండు రాష్ట్రాలూ వాటర్​ రిలీజ్ ఆర్డర్​ను కచ్చితంగా ఫాలో కావాలని స్పష్టం చేసింది. ఎంత మేర నీటిని వాడుకున్నారో తెలియజేస్తూ చీఫ్​ఇంజనీర్లు సంయుక్త ప్రకటన విడుదల చేయాలని సూచించింది.