
హాలియా, వెలుగు : కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ బీపీ పాండే, సభ్యుడు కేకే జాన్‌గఢ్ శుక్రవారం నాగార్జునసాగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పరిధిలోని లెవెల్ కెనాల్, లెఫ్ట్ కెనాల్, పవర్‌హౌస్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విజయ విహార్ అతిథి గృహంలో కేఆర్‌ఎంబీ సభ్యులను నందికొండ మున్సిపాలిటీ బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ హీరేకార్ రమేశ్ కలిశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ భద్రతను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు అప్పగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సీఆర్‌పీఎఫ్ బలగాలను ఉపసంహరించి తెలంగాణ ఎస్‌పీఎఫ్‌కు డ్యాం భద్రతను అప్పగించాలని కోరుతూ రమేశ్.. కేఆర్‌ఎంబీ చైర్మన్ పాండే కాళ్లు మొక్కారు. స్పందించిన పాండే.. పూర్తి స్థాయి విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారి వెంట ఇంజినీర్లు శ్రీనివాసరావు, సీతారాం, కృష్ణయ్య ఉన్నారు.