కర్ణాటక ఆర్టీసీ సుదూర ప్రాంతాలకు కొత్త సర్వీసులు ప్రారంభించేందుకు సిద్దమయింది. బెంగళూరునుంచి దాదాపు 15వందల కిలోమీటర్ల దూరంలో పూరి, అహ్మదాబాద్ సిటీలకు కొత్త బస్సు సర్వీసులను నడపనుంది. సుదూర ప్రాంతాలు బస్సులను నడపాలని డిమాండ్ వస్తున్న క్రమంలో పూరి, అహ్మదాదాబాద్ లాంటి ప్రాంతాలకు ఎయిర్ కండిషన్డ్ స్లీపర్ బస్సు సర్వీసులను నడపనున్నట్లు కేఎస్ ఆర్టీసీ సిద్దమయింది.
బెంగుళూరు నుంచి అహ్మదాబాద్, పూరి మార్గాల్లో ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. బెంగుళూరు నుంచి అహ్మదాబాద్, ఇండోర్, భోపాల్, జైపూర్, జైతారమ్, జోథ్ పూర్, జైసల్మేర్ వంటి ప్రాంతాలకు మాత్రమే ప్రైవట్ బస్సులు నడుస్తున్నాయి. బెంగుళూరు నుంచి సుదూర ప్రాంతాలకు బస్సులు వేయాలని ప్రయాణికులనుంచి స్ట్రాంగ్ డిమాండ్ ఉన్నందున ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు కేఎస్ ఆర్టీసీ ఎండీ తెలిపారు.
కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు కర్ణాటక రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపింది. సర్వీసులను నడిపేందుకు ఆయా రాష్ట్రాలను ఆర్టీసీ యాజమాన్యాలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ కొత్త బస్సులు ప్రారంభం కానున్నట్లు కేఎస్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
ఈ బస్సు సర్వీసులు ప్రారంభమైతే..బెంగళూరు నుంచి పూరి, అహ్మదాబాద్ కు కేవలం 27 నుంచి 28 గంటల్లో చేరుకోవచ్చు. ప్రతి రూల్ రెండు బస్సులు నడుపనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒడిశాలోని పూరి వంటి తీర్థ యాత్ర ప్రాంతాలకు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. టికెట్ ఛార్జీలు రూ. 2500 వరకు ఉండొచ్చని అంచనా .