నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తికి కృషి చేయండి : ఇంజినీర్ శ్రీనివాస్ బాబు

నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తికి కృషి చేయండి : ఇంజినీర్ శ్రీనివాస్ బాబు
  • 327 నూతన కార్యవర్గానికి చీఫ్ ఇంజినీర్ సూచన 

పాల్వంచ, వెలుగు: కేటీపీఎస్ లో నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తికి కార్మిక సంఘాలు కృషి చేయాలని కేటీపీఎస్ 7వ దశ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ బాబు సూచించారు. బుధవారం కేటీపీఎస్ కు చెందిన ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్​ యూనియన్(327) నూతన కార్యవర్గాన్ని జెన్కో అధ్యక్ష, కార్యదర్శులు పి.మాధవరావు, చిరుతాని సాయిబాబు ఆయనకు పరిచయం చేశారు. 

ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ.. కార్మిక సంఘాల నాయకులు కార్మికులకు దిశానిర్దేశం చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నూతనంగా ఎన్నికైన రీజినల్ అధ్యక్ష, కార్యదర్శులు జాలె కరుణాకర్ రెడ్డి, ముత్యాల కోటేశ్వరరావు, కోశాధికారి జానీ, సీనియర్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ అయినాల ప్రదీప్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ బి.లెనిన్, ఆర్గనై జింగ్ సెక్రెటరీ శ్రీశైలం, లేబర్ సెల్ జిల్లా ప్రెసిడెంట్ సాదం రామకృష్ణారావు, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సాంబమూర్తి, 5, 6వ దశల రీజియన్ అధ్యక్షుడు డోలి శ్రీనివాసరావు పాల్గొన్నారు.