క్రెడిట్‌‌ సొసైటీ ఓట్ల లెక్కింపు పూర్తి ..13 డైరెక్టర్‌‌ పోస్టులకు ఫలితాలు వెల్లడి

క్రెడిట్‌‌ సొసైటీ ఓట్ల లెక్కింపు పూర్తి ..13 డైరెక్టర్‌‌ పోస్టులకు  ఫలితాలు వెల్లడి

పాల్వంచ, వెలుగు : కేటీపీఎస్, వైటీపీఎస్, బీటీపీఎస్ కో ఆపరేటివ్‌‌ ఎంప్లాయీస్‌‌ క్రెడిట్‌‌ సొసైటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉత్కంఠభరితంగా సాగింది. 13 డైరెక్టర్‌‌ పోస్టులకు 37 మంది పోటీ చేయగా... బుధవారం ఎన్నికలు జరిగాయి. అనంతరం ఓట్ల కౌంటింగ్‌‌ మొదలు పెట్టగా... గురువారం రాత్రి 10 గంటల వరకు ఆరుగురు సభ్యులకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి.

 ఎస్‌‌టీ విభాగంలో ఒక డైరెక్టర్‌‌ పోస్ట్‌‌కు నునావత్ కేశూలాల్‌‌ నాయక్‌‌ విజయం సాధించగా, బీసీ విభాగంలో రెండు పోస్టులకు కోన నాగేశ్వరరావు, తోట అనిల్‌‌కుమార్‌‌లు గెలిచారు. అలాగే ఎస్సీ విభాగంలో ప్రకాశ్‌‌రావు, జనరల్‌‌ మహిళా విభాగంలో రావు స్పందన విజయం సాధించారు.  

ఎస్సీ మహిళ డైరెక్టర్‌‌ స్థానానికి ముగ్గురు పోటీ చేయగా దాసరి వీరమణి విజయం సాధించారు. ఏడు డైరెక్టర్ పోస్టులు గల జనరల్ కేటగిరీకి 20 మంది పోటీ చేయగా ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. 

కౌంటింగ్‌‌ను ఎన్నికల అధికారులు, ఉమ్మడి ఖమ్మం  జిల్లా కోఆపరేటివ్‌‌ ఆఫీసర్లు గట్టు గంగాధర్, అవధానుల శ్రీనివాస్‌‌ పరిశీలించారు. విజయం సాధించిన అభ్యర్థులు పటాకులు కాలుస్తూ, రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు.