కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది : కేటీఆర్

 కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది :  కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసెండెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన అభివృద్ధిని చెప్పుకోకపోవడమే మనము చేసిన తప్పన్నారు.  ఉద్యోగాలు ఇచ్చి కూడా మనం ప్రచారం చేసుకోలేకపోయామని..  కానీ బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలకు  సీఎం రేవంత్  నియామక పత్రాలు ఇచ్చి గొప్పలకు పోతున్నాడని విమర్శించారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ  కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.  

ఎన్నికల్లో  నిరుద్యోగులను, ఉద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ లాభం పొందిందని ఆరోపించారు కేటీఆర్.  కేసీఆర్ ఉన్నన్నాళ్ళు అన్నదాతలకు స్వర్ణయుగం అయిందని ..  చివరి భూములకు కూడా నీల్లిచ్చిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు.  ఉమ్మడి నల్గొండలో మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు కేటీఆర్. 

కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో మూడు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందన్నారు కేటీఆర్.  మళ్ళీ ఉర్లలో బోర్లు బండ్ల మోతలు వినబడుతున్నాయన్నారు.   రైతుల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.  మంత్రులు కోమటిరెడ్డి అన్నదాతలను చెప్పుతో కొడతాం అంటాడని... ఉత్తమ్ రైతు బంధు దుబారా అంటున్నాడని చెప్పారు. 

షిండే లు ఉన్నారన్న కేటీఆర్..    రేవంత్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  పార్లమెంటు ఎన్నికల  తర్వాత బీజేపీ లోకి పోయే మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం తమకు లేదని.. ఖమ్మం, నల్గొండ నేతలే కాంగ్రెస ను కూల్చుతారని ఆరోపించారు.