
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ ప్రచారం ఆశించిన స్థా యిలో కనిపించడం లేదని ఆ పార్టీ వర్గాలు కలవరపడుతున్నాయి. ఎల్బీ స్టేడియం సభకు జనాన్ని రప్పించకపోవడంతోనే ఆ విషయం తేలిపోయిందని అంటున్నాయి. దీంతో ఆ సెగ్మెంట్లపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పెష ల్ ఫోకస్ పెట్టాల్సి న పరిస్థితి నెలకొం ది. ఇప్పటివరకు జిల్లాల్లో ఆయన విస్తృ తంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా ఏడు రోజులే మిగిలి ఉంది.ఈ నెల 9వరకు కేటీఆర్ వివిధ జిల్లాల్లో ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. సమయం తక్కువగా ఉండటంతో జిల్లా పర్యటనలను ఆయన కుదించుకొని, లేదా రద్దు చేసుకొని.. ఆ సమయాన్ని గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల నియోజకవర్గాల ప్రచారానికి కేటాయించనున్నట్లు సమాచారం. గ్రేటర్ కార్పొరేటర్లు కొంత మంది ప్రచారంలో సీరియస్ గా పాల్గొనటం లేదన్న సమాచారం రావటంతో కేటీఆర్ అప్రమత్తమయ్యారు. సోమవారం తెలంగాణ భవన్ లో 99 మంది గ్రేటర్ కార్పొరేటర్లతో రెండు గంటలపాటు సమావేశమయ్యారు. గ్రేటర్లోని పార్టీ ప్రచార తీరుపై, కార్పొరేటర్ల వ్యవహార శైలిపై ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ప్రచారం ఉధృతంగా చేయాలని, ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిం చాలని ఆయన సూచించారు.
ఎల్బీ స్టేడియం సభ తర్వాత మారిన సీన్
గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల ప్రచార సభ మార్చి 29న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ రావాల్సి ఉండగా జనసమీకరణ తక్కువగా ఉండటంతో హాజరుకాలేకపోయారు. 5వేల మంది కూడా హాజరు కాలేదని ఇంటిలిజెన్స్ అధికారులు తేల్చారు. జనసమీకరణలో విఫలమైన గ్రేటర్ మంత్రులు, ఎంపీ అభ్యర్థులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఎల్బీ స్టేడియం సభరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామారెడ్డి, కరీం నగర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆ రోజు కేటీఆర్ హైదరాబాద్ లో ఉంటే జనసమీకరణలో ఇబ్బం దులు ఏర్పడేవి కాదని పార్టీ నేతలు, కార్యకర్తలు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిం చారు. కేసీఆర్ కూడా సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల నియోజకవర్గాలపైనే ఫోకస్ పెట్టాలనికేటీఆర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లా ల్లో కేటీఆర్ ప్రచారానికి మంచి స్పందన వస్తోందని , ఇంకా ప్రచారం చేయాలని ఒత్తిడి వస్తోంది. పరిస్థితుల నేపథ్యం లో గ్రేటర్లోని నియోజకవర్గాలపైనే ఆయన ఫోకస్ పెట్టను న్నట్లు సమాచారం.