ఆక్టోబర్ లో అదిలాబాద్ కు మంత్రి కేటీఆర్

ఆక్టోబర్ లో అదిలాబాద్ కు మంత్రి కేటీఆర్

నర్సాపూర్ (జి)వెలుగు:  వచ్చే నెల మొదటి వారంలో జిల్లాలో మంత్రి  కేటీఆర్ పర్యటిస్తారని కలెక్టర్ వరుణ్ రెడ్డి తెలిపారు. దిలావర్ పూర్  మండలంలోని గుండంపల్లి  కాళేశ్వరం ప్రాజెక్ట్, లక్ష్మీ నరసింహ 27 వ ప్యాకేజీ పనులను మంత్రి పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ ప్రాంతాన్ని,  పంప్ హౌజ్​లను శుక్రవారం  పరిశీలించి ఆఫీసర్లకు ఆయన  పలు సూచనలు చేశారు. 

మంత్రి కేటీఆర్​ పర్యటించే ప్రాంతాలలో మొక్కలు నాటి, ట్రీ గార్డ్  ఏర్పాటు చేసి రంగులు వేయాలని ఆదేశించారు. బహిరంగ సభ జరిగే ప్రాంతాల్లో పకడ్బందీ  ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్ వెంట అడిషినల్ కలెక్టర్ కిషోర్ కుమార్, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో మోహన్,  జడ్పీటీసీ  రమణారెడ్డి,  అధికారులు ఉన్నారు.